ఒకామె ఓ సాధువు వద్దకు వెళ్ళి "మా ఆయనలో ఒకటా రెండా బోలెడు లోపాలున్నాయి. ఆయనతో ఇక ఉండలేను. ఆయనకు దూరమైపోవాలనుకుంటున్నాను" అన్నది.ఆమె ప్రశ్నకు సాధువు ఇచ్చిన జవాబు..."తల్లీ! ఇదిగో ఇక్కడ బోలెడు మొక్కలు రకరకాలవి ఉన్నాయి. నీకేదైనా ఒక మొక్క ఇవ్వాలనుంది. నీకేది కావాలో ఎంచుకో" అని.ఆమె గులాబీ మొక్క కావాలంది."తల్లీ! దానిని పెంచడం అంత సులభం కాదు.అంతేకాదు, దానికి బోలెడు ముళ్ళుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గుచ్చుకుంటాయి. ఇదా నీకాలి?" అని అడిగాడు సాధువు."నాకు గులాబీ అంటే ఇష్టమండి. కనుక అందులో ఉన్న ముళ్ళు నాకంటికి పట్టవు" అందామె.జీవితమూ అంతే. ఇతరులను ప్రేమించడం అలవరచుకుంటే వారి లోపాలు పెద్దవనిపించవు.
ప్రేమిస్తే తెలియవు లోపాలు: - యామిజాల జగదీశ్