మేధపుష్టి(నానీలు):-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.


 1.మంచి ఆలోచనలు

మెదడుకు మేత

సవ్య గమనాలు

మేధకు చేయూత.


2.జ్ఞానం నిండి

పరిణతి పెరిగి

వికసనం జరిగి

పౌష్ఠికమవుతుంది.


3.శాస్త్రాలు

తార్కికతతో

భాషలు ప్రామాణికతతో

దోహదం చేస్తాయి.


4.యోగము వల్ల

అభ్యసనము వల్ల

మననము వల్ల

బలపడుతుంది.


5.నిరంతర 

చైతన్యం

నిత్యసమీక్ష

తేజస్సును కలిగిస్తాయి.


6.పని కల్పించి

చెత్తను తొలగిస్తే

సారాన్ని నింపితే

పస కలగుతుంది.


7.ఆహారం కూడా

అవసరమే

అవుతుందిలే

బలవర్థకం.