బాలగేయం: -సత్యవాణి

 ఆనందం పరమానందం
ఆనందం పరమానందం
నల్ల నల్లని మబ్బులు వేయగ
నాకేమో పరమానందం
నింగినుండి వడగళ్ళు పడగను
అనందం పరమానందం
చేతులుజాపి గిర్రున తిరుగ
ఆనందం పరమానందం
చిటపట చినుకులు చేతినితాకగ
ఆనందం పరమానందం
వాన నీటిలో పడవలు వేయగ
ఆనందం పరమానందం
జారు బురదలో జర్రున జారగ
ఆనందం పరమానంద
ఆనందం పరమానందం