ఆదివారం వచ్చింది
సెలవు రోజు అన్నాడు
పొలము వద్ద కెళ్ళాడు
నడుముకు బట్ట కట్టాడు
పొలములో కి దిగాడు
వొడ్డు వొరము పెట్టాడు
ఎరువులు చేతబట్టాడు
పొలమంతా చల్లాడు
వరి గుజులు పట్టాడు
పొలము లోనా వేసాడు
శ్రమకు ఓర్చి బాలుడు
తండ్రికి సాయం చేశాడు
కాళ్లు చేతులు కడిగాడు
ఇంటికి అతడు వెళ్ళాడు
బుక్కెడు అన్నం తిన్నాడు
హాయిగా నిద్దరపోయాడు
ఆదివారం బాల గేయం:-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట