అంతర్జాతీయ భాషఆంగ్లభాష ......
అందుకే ఆంగ్లాన్ని ,
బోధనా బాషగా
స్వీకరిస్తా ......!
హిందీ మన --
జాతీయ భాష ...
త్రిభాషా సూత్రానికి
కట్టబడి ఉంటా ...!
మాతృభాష ' తెలుఁగు '
మాట -పాట -ఆట ,
వ్రాత ....అంతా ...
ఆత్మీయంగా తెలుగులోనే !
సంస్కృతం ...
సర్వభాషలకూ మూలం ,
అదిచదివే అవకాశం ఉంటే ,
అంతా అదృష్టమే ...!
భాషలెన్ని నేర్చినా ...
తియ్యని తెలుగును
మర్చిపోను .....!
మాతాత ఆశలను
అడియాసలు చెయ్యను !!
-===================
ఫొటోలో----బేబీ ఆన్షి.నల్లి.
తియ్యని తెలుఁగు భాష !!:----డా.కె .ఎల్వీ -హన్మకొండ .