భూమ్యాకాశాలు కలిసే చోటసముద్రపుటంచుల చోట
నీ ప్రభవ ప్రాభవం అద్భుతం
అది పుడమి చేసుకున్న పుణ్యం!!
నీ రాకతో పులకించు ప్రకృతి
కుహు కుహు రాగాలతో ఆలపించు గీతి
కొక్కరకో యని పలుకు పుంజు ప్రీతి
జనాలకు తొలుగు చలి భీతి!!
నీ కరుణా కిరణాలే జగతికి ఆధారం
పంటల పైరులు నీతోనే బలోపేతం
సర్వ జీవకోటికి నీ వెలుగులే ఆలంబనం
పసి పిల్లల నుంచి పండు ముదుసలి వరకు విటమిన్ "డి" ఉచిత సౌలభ్యం
ఆరు నెలలకు ఒకసారి అయనం
మారుస్తావు దిశ అటు వైపు పయనం
అన్ని ప్రాణులకు దారి చూపు నీ నయనం
రథ సప్తమి రోజు నీ పండుగ
నీవు రాని రోజు ఎండలేని ఎండగ
జగతి నేలే జగద్రక్షకుడవు
సూర్యనారాయణుడవైన
సాక్షిభూతుడవు!!
రథ సప్తమి:- కవిత వెంకటేశ్వర్లు