అల్బుకార పండు- ఉపయోగాలు...: పి . కమలాకర్ రావు
 ఆల్బుకారా పండ్లలో పోషక విలువలు చాలా ఎక్కువ. ఇదివరలో  ఈ పండు మనకు డ్రై ఫ్రూట్ గానే దొరికేది. ఇటీవలికాలంలో  ఈ పళ్ళు మనకు విరివిగా దొరుకుతున్నాయి.  ఈ పండులో తీపికన్నా పులుపు చాలా ఎక్కువ.
 కొన్ని ఆల్బుకారా పళ్ళను ముక్కలుగా కోసి లోపలి గింజలు తీసి వేసి  నీటిలో వేసి కొద్దిగా అల్లం ముద్దను బెల్లం లేక తాటి కలకండ ను కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత తాగితే ఇది అజీర్తి రాకుండా కాపాడుతుంది. ఇది వాంతులను నివారిస్తుంది.
కొన్ని ఎండిన ఆల్బుకారా పండ్లలో ఉలవల కషాయం తయారుచేసి కలిపి తేనె వేసి త్రాగితే రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ ను రానివ్వదు.
 మలబద్ధకం సమస్య తగ్గడానికి ఎండిన ఆల్బుకారా పండ్లలో సోంపు కలిపి మరిగించి తాటి కలకండ కూడా కలిపి గోరువెచ్చగా త్రాగితే విరేచనం సాఫీగా జరుగుతుంది. దీన్ని వాడి చిన్న పిల్లలకు కూడా మలబద్ధకం సమస్య తగ్గించుకోవచ్చు.
జ్వరం వచ్చి తగ్గిన వారు నాలుక పై రుచి ని కోల్పోయి ఆహారం తినడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఎండిన ఆల్బుకారా పండ్లను లోపలి గింజలు తీసి వేసి చప్పరించి తింటూ ఉంటే నాలుక పై రుచి పెరుగుతుంది. ఆకలి కూడా పెరుగుతుంది.