వస్తున్నాడు:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 రాం రాం రాముడు బాలల్లారా
మన రాముడొస్తున్నాడు   ,,
మన దేవుడొస్తున్నాడు     ,,
చక్కనైన రథము మీద బాలల్లారా
మన రాముడొస్తున్నాడు    ,,
మన దేవుడొస్తున్నాడు      ,,
సీతా సమేతముగా బాలల్లారా
మన రాముడొస్తున్నాడు   ,,
మన దేవుడొస్తున్నాడు     ,,
లక్ష్మణుడు తోడురాగ బాలల్లారా
మన రాముడొస్తున్నాడు   ,,
మన దేవుడొస్తున్నాడు     ,,
హనుమంతునితోసహా బాలల్లారా
మన రాముడొస్తున్నాడు   ,,
మన దేవుడొస్తున్నాడు     ,,
ఊరూరా తిరిగినాడు బాలల్లారా
మన ఊరికొస్తున్నాడు     ,,
మన రాముడొస్తున్నాడు   ,,
మన దేవుడోస్తున్నాడు     ,,
వాడలన్ని తిరిగినాడు బాలల్లారా
మన వాడకొస్తున్నాడు      ,,
మన రాముడొస్తున్నాడు    ,,
మన దేవుడొస్తున్నాడు      ,,
వీధులన్ని తిరిగినాడు బాలల్లారా
మన వీధికొస్తున్నాడు        ,,
మన రాముడొస్తున్నాడు    ,,
మన దేవుడొస్తున్నాడు      ,,
ఇండ్లన్నీ తిరిగినాడు బాలల్లారా
మన ఇంటికొస్తున్నాడు     ,,
మన రాముడొస్తున్నాడు   ,,
మన దేవుడొస్తున్నాడు     ,,
పూలు పత్రి పెట్టండి బాలల్లారా
పూజలన్ని చేయండీ        ,,
చేతులెత్తి మొక్కండీ        ,,
ఆశీస్సులు కోరండీ          ,,