బాల గేయం: -దేశపతి మోహన్ శర్మ. మెదక్

 కరోనా.. మళ్లీ వస్తుంది
దూరం దూరం జరగండి
శానిటైజర్ వాడండి
మాస్కులు మాత్రం మరవద్దు
గుంపుగా మీరు ఉండొద్దు
చేతులు చేతులు కలపొద్దు
నిర్లక్ష్యాన్ని చేయొద్దు
జలుబు దగ్గు మీకుంటే..
జ్వరము వీడక పోతుంటే..
కరోన పరీక్షకు వెళ్ళండి 
తగిన మందులు వాడండి
గృహనిర్బంధం పాటించండి
గదిని సానిటైజ్ చేయండి
పళ్ళు గుడ్లను తినండి
పరిశుభ్రంగా ఉండండి
సొంత వైద్యం చేయొద్దు
ఆందోళనకు గురి కావొద్దు
వైద్యుని సూచన పాటిద్దాం
వ్యాక్సిన్ డోసులు వేసేద్దాం
వ్యాధిని మళ్ళీ రాకుండా...
వైరస్ను తరిమేద్దాం!