దాసరికోటిరత్నం: ---డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్ .

 మనతెలుగు నాటకరంగంలో స్త్రీ పాత్రలు ధరించిన పురుషులుఎందరో ఉన్నారు.కాని పురుషపాత్రలు నభూతో నభవిష్యతిగా పేరుపొందిన నటిమణులలో మొదటివారు దాసరికోటిరత్నం.నలభైఎళ్ళపాటు సుధీర్ఘనటప్రస్ధానంలోనటిగా,దర్మకురాలిగా,నాటక  సమాజ నిర్వాహకురాలుగా, తొలిమహిళా నిర్మాతగా,బహుముఖప్రజ్ఞాశాలిగా,తెలుగుసినీరంగంలో చరిత్రసృష్టించారు.
ఈమెకళలకు పుట్టిల్లు అయిన గుంటూరుజిల్లా నరసరావుపేట తాలూకా పత్తిపాడు మండలం లోని పెదగొట్టిపాడులో జన్మించారు.తండ్రి నటుడు కావడంతొ తన తొమ్మిదోఏటనే రంగప్రవేశంచేసి హరిశ్చంద్రలో లోహితాస్యుడు,బొబ్బిలియుద్ధంలో చినరంగారావు,లవకుశుల్లో కుశుడుగా,భక్తప్రహ్లాదలో ప్రహ్లాదుడిగా తనఅసమాన నటనతొ ఎంతోపేరు పోందారు.అలా ప్రదర్మనలుయిస్తూ రాజనాల వెంకటప్పయ్య శాస్త్రిగారివద్ద సంగీతశిక్షణ పొందారు.తల్లిమరణంతో నరసరావుపేట తాలూకాలోని నక్కబొక్కలపాడులో ఒక నాటక సమాజాన్ని స్ధాపించారు.అలా "ఉషాపరిణయం" "శశిరేఖాపరిణయం""కనకతార""సావిత్రి"వంటినాటకాల్లోనటిస్తూదొమ్మేటిసూర్యనారాయణతొకలసి "రంగూన్ రౌడి"నాటకం రెండువందల పైగా ప్రదర్మించారు.
తెనాలి మల్లాదిగోవిందశాస్త్రి, పారుపల్లిసుబ్బారావు. వంటివారితోకలసిఎన్నో ప్రదర్మనలు యిచ్చారు. అదేసమయంలో దంటూవెంకటకృష్ణయ్యగారు నవలానాటకసమాజంస్ఢాపించారు .అందులో కన్నాంబ,బందరురమాబాయి,గుంటూరుతిలకం,శ్రీహరి,అంజిబాబు,సరస్వతమ్మ వంటివారితోకలసి "సతీఅనసూయ" "గంగావతరణ"నాటకాలలో నారదునిగా రెండువందలనాటకాలలో నటించి మంచిపెరుపొందారు.మద్రాస్ రాయల్ ధియోటర్ లో సత్యవంతునిపాత్ర ధరించి దేశోధ్ధారకనాగేశ్వరరావుపంతులుగారిచే సువర్ణకంకణాలను పొందారు.నైజాంనవాబ్ గారికోటలో" సావిత్రి"నాటకంప్రదర్మించి వెండిగొడ్డలి,వెండితాడు బహుమతిగా అందుకున్నారు.సావిత్రినాటకం ఈమెకు ఎనలేని కీర్తిప్రతిష్టలు లభింపజేసాయి.
రాజమండ్రివాస్తవ్యుడు బి.వి.రమానందరావు "సతీసక్కుబాయి"చిత్రంనిర్మిస్తూ సక్కుబాయి పాత్రకు కోటిరత్నాన్ని ఎంపికచేసుకుని కలకత్తా తీసుకువెళ్ళారు.ఈచిత్రంలో శ్రీకృష్ణుడుగా తుంగలచెలపతిరావు.జమునాబాయిగా సూరవరపు వెంకటేశ్వర్లు(ఒకపురుషుడు తెలుగుసినిమాలో స్త్రీపాత్ర పోషించడంఅదేప్రధమం)అసలు వేదికపై నాటకంలో తుంగలచలపతిరావు సక్కుబాయిగా, కోటిరత్నం శ్రీకృష్ణుడుగా నటించేవారు .కాని సినిమాకివచ్చేసరికి వీరిపాత్రలుమారిపోయాయి.21/05/1935 న ఈచిత్రం విడుదలై ఘనవిజయం సాగించింది.ఈచిత్రనిర్మాణంనాలుగునెలలు నిర్మాణరీతిపై అవగాహన ఎర్పరచుకుని,
సినిమా నిర్మాణంపట్లమక్కువ పెంచుకున్న కొటిరత్నం అదేట్రూపుతొ కలకత్తవెళ్ళి తను నిర్మాతగా "సతీఅనసూయ"చిత్రంలోతనుఅనసూయగానటిస్తూ, అహిన్ చౌదరిదర్మకత్వంలోనిర్మించింది.ఈచిత్రం 4/10/1935 నవిడుదలజరిగింది.అలాఆమె "హరిశ్చంద్ర" "శ్రీకృష్ణలీలలు" భక్తకుచేల" "శ్రీకృష్ణతులాభారం" "మోహినిభస్మాసుర" "లంకాదహనం" "వరవిక్రయం"( నటిభానుమతిగారి తొలిచిత్రం)"పాదుకాపట్టాభిషేకం" "వాల్మికి" "వరూధిని( S.V.R)గారి తొలిచిత్రంలో కధానాయకిగా,"గొల్లభామ" "చంద్రవంక" "అగ్నిపరిక్ష" "బంగారుభూమి"వంటి పలుచిత్రాలలో నటించారు.
1958 లో ఆరోగ్యందెబ్బతినడంతొ గాత్రందెబ్బతినడంతొ సినిమాలు లెకపోవడం ధనంకరిగి వట్టిచేతులతో మందగించిన చూపుతో  తనస్వగ్రామంచేరింది.1960 లో చివరిసారి తణుకులో ఆంధ్రనాటకకళాపరిషత్తువారు సన్మానించారు.అడిగినవారికి లేదనకుండా దానంచేసిన కోటిరత్నంగారు చివరిరోజుల్లో ఆర్దికయిబ్బందులకు లోనై 1996 లో నక్కబొక్కలపాడు లో కనుమూసారు.