కర్ణునిజననం(పురాణకథ): -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.


 మహాభారత కాలంలో కుంతిభోజుని ఇంటికి వెళ్లాడు దుర్వాసుడు. ఆయనకు అతిధి సేవలు చేయడానికి తన పెంపుడు కూతురు "కుంతి"ని వినియోగించాడు కుంతిభోజుడు. అలాకుంతి అత్యంతభక్తశ్రధ్ధలతో ,దుర్వాసుని చూసుకోసాగింది.తను వెళ్లేప్పుడు కుంతి సేవలకు సంతోషించిన దుర్వాసుడు"అమ్మయి పెద్దల ఎడల నీకున్న గౌరవము, సేవాభావము నన్ను ఆనంద పరిచాయి. ఏంవరంకావాలోకోరుకో" అన్నాడు.మౌనంగాఉన్న కుంతిని ఆశీర్వదించి "తల్లి నీకోమంత్రాన్ని ఉపదేసిస్తాను.దాన్నిపఠించి నువ్వు ఏదేముడిని స్శరిస్తే వారువచ్చి నీ కన్యత్వనికి భంగంవాటిల్లకుండా,నీకు సంతానాన్ని ప్రసాదిస్తారు.నాఈవరం నీముందు జీవితానికి నీవంశం నిలబెట్టుకోవడానికి వినియోగపడుతుంది" అనిమంత్రోపదేశం చెసి వెళ్లిపోయాడు.

కొద్దిరోజుల అనంతరం నదీతీరంలో సాయంకాలం వనవిహారం చేస్తున్న కుంతి పడమటి దిశకు కుంగుతున్న సూర్యుని చూసి ఆమె ఆనందపడి. చాపల్యంతో దుర్వాసుని వరంగా లభించిన మంత్ర నిజంగా పనిచేస్తుందా అన్న సందేహంతో తనకు బిడ్డను ప్రసాదించమనిసూర్యుని కోరింది.వెంటనే ప్రత్యక్షమైన సూర్యుడు "అమ్మయి నీకోరిక ప్రకారం బాలుని ప్రసాదిస్తున్నాను"అని సహజ కవచ కుండలాలు కలిగినబిడ్డను ప్రసాదించి వెళ్లిపోయాడు.ఆ సంఘటనకు భయపడిన కుంతి నదిలో వస్తున్న మందసంలో ఆబిడ్డను పెట్టి గంగాదేవికి నమస్కరించింది.నీటి ప్రవాహంలో వెళ్లిన మందసం భార్యాసమేతంగా నదీవిహారం చేస్తున్న అర్ధరదుడైన రాధేయునికి లభించింది.తనబిడ్డగా పెంచుతూ కర్ణుడు అనే పేరు పెట్టారు.