రచయిత చిటికెన కిరణ్ కుమార్ కు సన్మానం.


 ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం రాజన్న సిరిసిల్ల లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో ఇటీవలె సామాజిక అంశాలపై రచనా వ్యాసాలు, కథలు, కవితలతో రచనలు కొనసాగిస్తున్న సందర్భంగా  ప్రముఖ రచయిత చిటికెన కిరణ్ కుమార్ కు వేదిక తెలుగు నంది విశిష్ట పురస్కారం కు ఎంపిక మరియు ఎ కె తెలుగు మీడియా ముంబై వారు అందించిన తెలంగాణ సాహిత్య రత్న ప్రశంసా పురస్కారం   వచ్చినందున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మరియు అలుమిని అసోసియేషన్ వారు కిరణ్ కుమార్ ను సన్మానించారు. ఈ సందర్భంగా తనను సన్మానించిన అధ్యాపక బృందానికి మరియు ఆలుమిని అసోసియేషన్ వారికి ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ కళాశాల అభివృద్ధి కోసం తన కృషి ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల తన తోటి పూర్వ విద్యార్థులు నక్క శ్రీకాంత్, చేరాల ప్రభాకర్, ఆడెపు వేణు, నడిమెట్ల శ్రీనివాస్, రంగనాయకుల కిరణ్ కుమార్, జక్కని నవీన్ లు కిరణ్ కుమార్ ను అభినందించారు.