చిట్టిచిలక:-డా.కందేపి రాణి ప్రసాద్

 అందాల నెలవంక దిగి చూడవా నేల వంక
నీకన్నా ఎంతో అందమైనది నా గోరువంక
వెన్నెల తునకా కిందికి వెచ్చేయవా మా వంక
నీకన్నా ఎంతో చక్కనైనది నా చిన్నారి నడక
నేలలోని మొలకా బయటకు రావా వెలుగువంక
నీకన్నా ఎంతో పచ్చనైనది నా చిట్టి చిలక