రంగుల పాలపిట్టారావే బుజ్జి పిట్టా
నీతో జట్టు కట్టా
గింజలు,నీరూ పెట్టా!
చేలలో తిరుగు పిట్టా
చేతిలో ఇముడు పిట్టా
చేరికయితివే ఇట్టా
రాష్ట్రాల జాతి పిట్టా !
రైతుల నేస్తమా
దశమికి విజయమా
ప్రకృతి రూపమా
దర్శనం భాగ్యమా !
రెక్కలు విప్పారే
కూతలు అయ్యారే
సంబర మంబరమే
శుభముల నియ్యాలే!!
పాల పిట్ట (బాల గేయం ):---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు