కప్ప గారూ!కప్ప గారూఎక్కడికి వెళ్లుచున్నారు?
కామందు గారింటికి
రమ్మంటే వెళుతున్నాను!
కామందు గారింటికి
ఎందుకు వెళుతున్నారు?
కామందుకు మందులు
ఇచ్చేందుకు వెళుతున్నాను!
కామందు గారికిప్పుడు
ఏమి జబ్బు చేసెను?
కామందుకు మచ్చలు
వంటి నిండా వచ్చెను!
అవి ఎలాంటి మచ్చలో
చూసి చికిత్స చేస్తాను!
ఆయన బాధ తగ్గించి
వైద్యం చేసి వస్తాను!
నీ వంటి మీద మచ్చలే
నీవు తగ్గించుకోలేదు
ఇక కామందు మచ్చల్ని
మరెలా తగ్గించగలవు?
తన వంక చూసుకున్న
కప్ప నోరెళ్ళ బెట్టెను!
ఇక ఎప్పుడు కూడా
వైద్యం జోలికెళ్లలేదు!
కప్ప గారూ: -డా.కందేపి రాణి ప్రసాద్