ఇదుగో నా చిన్నిసైకిలుతొక్కుతూ వేస్తా బ్రేకులు
వెనుక సీటులో చెల్లాయి
నవ్వుతు కూర్చొని ఉందోయి!
పుట్టినరోజు బహుమతిగా
నాన్నారిచ్చిన సైకిలిదోయ్!
మార్కెట్‌కెళ్లి వస్తాగా
జాగ్రత్తగానే తొక్కాలోయ్ !
ఎండా వానలో వదిలేయకూ
తాళం ఎక్కడో పడేయకూ
చక్కని నేస్తమా నా సైకిల్
పాఠశాలకూ వెళ్ళుటకూ !
ఎప్పటికప్పుడు తుడవాలి
తుప్పునుపట్టక ఆయిల్‌తో
మళ్ళీ కలుస్తా ఉండండి
దోస్తులకి పార్టీ ఇవ్వాలి!
సైకిల్ (-బాల గేయం )--- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు