ఏకపది:(సంతానం)*******
1.దాంపత్యపు తీపుగుర్తులుగా_జన్మించే పిల్లలు.
2.ప్రేమ ఫలాలుగా_రక్తసంబంధాన్ని కలిగిన బిడ్డలు.
ద్విపదం:(పెళ్ళిళ్ళు)
********
1.ఇరువురిని సంప్రదాయంతో కలిపే బంధం.
గృహస్థధర్మానికి అంకురార్పణం.
2.స్త్రీ,పురుషులిద్దరి సహజీవన సంరంభం.
అనుబంధపు కొత్త జీవిత ప్రారంభం.
త్రిపదం:(సంబంధాలు)
*******
1.వ్యక్తుల మధ్య ఏర్పడే బాంధవ్యాలు.
కుటుంబాలు కలిసిపోయి పంచుకొనే బంధాలు.
బాధ్యతలతో ముడిపడిన అనుబంధాలు.
2.ఆడ,మగ తేడా లేకుండా ఏర్పరచుకొనే స్నేహాలు.
అభిరుచులు,అలవాట్ల ప్రేమ సమ్మేళనాలు.
గౌరవం,మర్యాదలతో నిర్మించుకొనే దగ్గరితనాలు.
చతుర్థపదం:(నిజాయితీ)
**********
1.నిజాన్ని మాత్రమే చెప్పగలిగే గుణం.
నిబద్ధతతో నడుచుకొనే విధానం.
ఖచ్చితమైన అభిప్రాయం కలిగి ఉండడం.
సత్యమార్గంలో క్రమశిక్షణగా నడవడం.
2.నమ్మకాన్ని వదలకుండా ఆచరించడం.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం.
స్వచ్ఛమైన మనసుతో నిలిపే నైతిక విలువ.
కపటం లేని ఋజుమార్గం.
అక్షరమాలికలు: డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.