అబ్బాయికి ఉన్నారునేస్తాలు చూడు
నేస్తాలు వారు
ఎటువంటి వారు?
పందిపిల్లను ఎక్కి
పరుగెత్తువారు
కుక్కపిల్లను ఎక్కి
కూర్చుండువారు
ఎలుకపిల్లను ఎక్కి
ఎగిరేవారు
చేపగంపలకాడ
చెయిజాచువారు
కూరగంపలకాడ
కూర్చుండువారు
పల్లేరుగాయల్ల
పరుపేయువారు
మామిడీతోపుల్ల
మంటపెట్టేవారు
అటువంటి వారితో
స్నేహమూ వద్దురా
ధీరులూ శూరులూ
ఆలోచనాపరులు
ఆడితప్పనివారు
పరోపకారులూ
మంచినేస్తాలను చూసి
చెలిమిచేసుకోరా !!
నేస్తాలు:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.