పిల్లలు పిడుగులు(బాల గేయం)-ఎడ్ల లక్ష్మి . సిద్దిపేట

 పిల్లలం మేము పిల్లలం

మే విరబూసిన మళ్ళెలం

ఆట పాటలతో మేమంతా

ఎగీరి దూకే జలపాతాలం


పిల్లలం మేము పిల్లలం

అమ్మనాన్నల దివ్వెలం

నిండు పున్నమి వెన్నెల్లో

చల్లని కిరణ కాంతులము


పిల్లలం మేము పిల్లలం

భానుడి కిరణాలం మేమే

చీకటిని తరిమి వేసే

చిరు దివ్వెలము మేమే 


పిల్లలం మేము పిల్లలం

పిడికిలి బిగించి పట్టుకుని

ఉరిమి పడే పిడుగులము

దేశానికి చూట్టూ రక్షకులం