మాతృభాష దినోత్సవం:-కవిత వేంకటేశ్వర్లు
 "అ"తో మొదలయిన జీవితం
అక్షరమాలతో అల్లుకొని
అమ్మ చేతి ముద్దలు తింటూ
అమ్మకు ముద్దులు పెడుతూ
పెట్టించుకుంటు
అమ్మ కొంగు చాటున ఆడుకుంటూ
నేర్చుకున్న మాతృభాష
కాదది మృతభాషా
దేశాభాషలందు తెలుగు లెస్స
అనిపించుకున్న మహోన్నత భాష
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు 
నుంచి వెస్టు సౌత్ నార్త్
అన్ని దిక్కులను కలిపిన
మన తెలుగు బెస్ట్
నన్నయ తిక్కన ఎఱ్ఱప్రేగడ
మహాభారతాన్ని తెనుగించారు
అష్టదిగ్గజాలు అప్రతిహతంగా
తెలుగు కావ్యాలను లిఖించారు
చిరకీర్తీనార్జించి చిరస్మరనీయులైనారు
విఖ్యాత ప్రఖ్యాత గ్రంథాలనెన్నో
విరచించి వినూత్న పోకడలతో
పయనించి భారత దేశ పేరు
ప్రతిష్టలను సుస్థిర0 చేసిన
మహాకావులెందరో
గురజాడ గిడుగు వీరేశలింగం
రాయప్రోలు దేవులపల్లి చలం
శ్రీ శ్రీ సినారె రవీంద్రనాధ్ టాగూర్ పేరు మోసిన కవులు
ఆధునిక కవులు ఆంధ్రభాషను
అంతేత్తు శిఖరముపై నిలిపారు
పాత కొత్త కవులతో తెలుగు
వెలుగుతుంది
ఆటవెలుదులతో అందంగా
కందములతో కమనీయంగా
మత్తేభాలతో మందస్మితంగా
చంపకమాలతో సంపెంగ
మాలల్లాగా
ఉత్పలమాలతో ఊహల్లో విహరింపజేయగ
వచనంలో విహంగాలై
గద్యంలో గరుత్మంతులై
పద్యంలో ప్రగతి శీలులై
అపరిమిత భాష పరిజ్ఞానులై
ప్రజలకు ఆనందాన్ని అందిన్చే
కలం పట్టిన కవుల0దరికి
మృతభాష కాని మన అమృత
భాష దినోత్సవ శుభాకాంక్షలు
అందిద్దాం అభినందన అక్షరలక్షలు!!