మౌనభాష ..!!:------డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,హన్మకొండ .

 నీ ..మౌనానికి 
అప్పుడే సంవత్సరాలు 
గిర్రున తిరిగిపోతున్నాయ్ ...!
నీ ..మౌన భాష 
నేనుకూడా నేర్చుకున్నా ,
లేదంటే --
మౌనానికి సమాధానం ,
మౌనం కాదుకదా !
అందుకే -
మృదువైన మాటలు 
నీముందు పరుస్తున్నా .
నువ్వు ఇలా తొంగి చూసి 
అలా వెల్లిపోవడం ---
నా కళ్లు కెమెరాలై నిన్ను 
చిత్రిస్తూనే వున్నాయ్ !
నీమూగప్రేమలో 
మాధుర్యాన్ని -
నాకందిస్తూనేవున్నాయ్ !!