కట్టుబాట్ల కంచెలోపల్లవిస్తున్న చిగురాశనా..?
అస్థిత్వం కై అహరహము
శ్రమిస్తున్న శ్రామికురాలినా..??
ఎదురుదెబ్బల గాలివాటానికి
నిలదొక్కుకు నిలబడుతున్న
పట్టదలతరువునా..?
సమస్యల సుడిగుండంలో
ఎదురీదుతున్న ధైర్యపు నావనా..??
వెన్నుపోటుల వెన్నువిరుస్తూ
నలుగరికి అండైతున్న ప్రోత్సాహక వెన్నెముకనా..?
అవాంతరాల రాళ్లను పక్కకు నెడుతూ
ఆత్మవిశ్వాసపు పాదాలతో
విరామమెరుగక సాగుతున్న మగువనా..??
క్షణం క్షణం
రెట్టింపవుతున్న సత్తువతో
సమాజ దిశానిర్ధేశినై వెలుగుతున్న వేగుచుక్కనేమో?
బాలల భవితను సువర్ణాక్షరాలతో
లిఖించగా
సృజించబడ్డ గురువునేమో?
కుళ్లు మనుషుల మనసుల ప్రక్షాళన చేస్తూ
ఆత్మీయతను అంటుతున్న మాతృమూర్తినేమో?
ఎమో?
ఎవరినో ఏమో?
మంచితనంతో శత్రువులను పెంచుకుంటున్న అభాగ్యురాలినేమో?
గెలుపుతో మలుపులు తిరుగుతున్న విజయబావుటానేమో??
నేనెవరిని..:-అయిత అనిత