రైలు బండి (-బాల గేయం):-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు.


 చికు బుకు రైలు వస్తుంది 

పక్కకు తొలిగి నిలవండి 

సామాన్లన్నీ పట్టుకొని 

సమయం లోపల ఎక్కండి!


సీటు నెంబరు చూడాలి 

టిక్కెట్ జాగ్రత్త చేయాలి 

ప్రక్క వారితో స్నేహంగా 

ప్రయాణమంతా చేయాలి!


భోజన సమయం శుభ్రతతో 

ఇబ్బంది కలుగని పద్ధతితో 

జెంటిల్ మ్యాన్ అనిపించాలి 

జాగ్రత్తలు పాటించాలి !


కిటికీ బయటకు చేతులొద్దు 

ద్వారo దగ్గర నిలవొద్దు 

పెద్దలు దగ్గర లేకుండా 

అటు ఇటు అస్సలు తిరగొద్దు!


దూరం వెళ్లే సమయంలో 

చక్కని పుస్తకాలు సంచీలో 

కాలక్షేపం అవుతాయి 

కొత్త అనుభవo ఇస్తాయి!


దారిలో వచ్చే ఊర్లేవో 

చిన్ని పొత్తములో రాయండి 

రైలు ప్రయాణం సరదాగా 

అంత్యాక్షరిని ఆడండి !


-