నేర్వాలి:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 పొద్దున లేచీ

కాలకృత్యములు

తీర్చుకొనీ

పాచి పళ్ళను

మల్లెలకంటే

తెల్లగా తోమీ

చక్కగ స్నానం చేసీ

ఉతికిన బట్టలు

తొడుగుకొనీ

అమ్మ పెట్టిన

అన్నం కుడిచీ

రోజూ బడికీ

వేళకు పోవాలీ

గురువును గౌరవించాలీ

చక్కగ చదువు

నేర్వాలీ !