టి.జి.కమలాదేవి. :-- డా.బెల్లంకొండనాగేశ్వరరావు-చెన్నయ్ .


 తొలుత రంగస్ధలంలో కాని సినిమారంగంలోకాని సొంతగాపాడుకునేవారికి అవకాశాలు ఎక్కువ.ఒకప్పుడు మద్రాసునగరాన్ని మనవాళ్ళు చెన్నపట్నంగా పిలిచేవాళ్ళు.అప్పుడు సెంట్రల్ రైల్వేస్టేషన్ వెలుపల పడమరదిశలొ రిప్పన్ బిల్డింగ్ (నేటి చెన్నయ్ కార్పొరేషన్ కార్యలయం) పక్కనే "చెన్నపురి ఆంధ్రమహాసభ"ఉండేది.ఈబిల్డింగ్ లోనివేదికపై ప్రదర్మనయివ్వని రంగస్దలనటులు లేరంటే అతిశయోక్తికాదు.ఈసభమందిరానికి ఉన్నతి పదవులు అలంకరించి మహాన్నత కళారంగసేవలు అందించిరు కమలాదేవిగారు.

ఈకళామూర్తి 1929 డిసెంబర్ 29 న చిత్తూరుజిల్లా కార్వేటినగరం లొ కృష్ణస్వామి నాయుడు లక్ష్మమ్మ దంపతులకుజన్మించారు.చిన్నవయసునుండే కళారంగంపై మక్కువఏర్పరచుకుని తండ్రి  ప్రోత్సహంతో పాడటంనేర్చుకున్నారు.ఆమె తన పదకొండవఏటనే గ్రాంఫోన్ రికార్డులకొరకు పాటలు పాడారు.పలునాటకాలలో నటించారు.

(1941)లొ విడుదలైన"చూడామణి"చిత్రంలొ సి.యస్ .ఆర్ .చెల్లేలుగానటించి తొలిసారి సినిరంగంలో ప్రవేసించారు.వీరి సోదరి జయమ్మగారు ప్రముఖ నటుడు చిత్తురినాగయ్యగారిభార్య. అక్కినేనివారితొలిచిత్రం"సీతారామజననం"  (1944)చిత్రంలొ అహల్య పాత్రధరించారు.తదుపరి "మాయాలోకం"(1945)చిత్రంలొ మంచిపేరు పొందారు.(1946)వచ్చిన"ముగ్గురు మరాఠిలు"చిత్రంలో అక్కినేనికి జోడిగా నటిస్తూ'ఛల్ చలోవయ్యరిషికారి'అనేపాట అక్కినేనితొ కలసి పాడారు."గుణసుందరికథ"(1949) "మల్లేశ్వరి" (1951) "పాతాళభైరవి "చిత్రంలో 'ఇతిహాసంవిన్నారా ..ఆఅతిసాహాసులేఉన్నారా హెచ్చరికో హెచ్చరిక'అనేపాట పాడుతూ నటించారు.పల్లెటూరు"(1952)"చక్రపాణి"    " తొడుదొంగలు"(1954)"భక్తరామదాసు" "కంచుకోట"(1967)"అసాధ్యుడు" "బంగారుసంకెళ్ళు"(1968)"కథానాయకుడు(1969)"పెత్తందార్లు""ఇల్లరికం"(1959)"వెలుగునీడలు"(1961)"బంగారుపంజరం" (1969)జమిందార్గారిఅమ్మయి" (1975) వంటి అరవైచిత్రాలలో విభిన్నపాత్రలలో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.తనపాట తనేపాడుకునే ఈమె ఆవులచంద్రబాబు నాయుడు అనే రంగస్ధలనటుని ప్రేమవివాహం చేసుకున్నారు.

"దొంగలున్నారుజాగ్రత్త"(1958)చిత్రలొజి.వరలక్ష్మిగారికి,"భక్తరామదాసు"(1964)చిత్రంలొ కన్నాంబ గారికి,నందమూరినటించిన"సంపూర్ణరామాయణం"లో పద్శిని కి,"పాండురంగమహత్యం"చిత్రంలో బి.సరోజదేవిగారికి డబ్బింగ్ చెప్పారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కమలాదేవిగారుగోప్పక్రీడాకారిణి".బ్రిలియర్ట్స్ "ఆటఆడిన తొలిమహిళగా జాతీయగుర్తింపు పొందారు.వందలాదినాటకాలలో పురుష పాత్రలుధరించి మెప్పుపొందారు.తనుసొంతగా ఒనాటక సమాజంస్ధాపించి "అలెగ్జాండర్ "పాత్ర పలుమార్లుపోషించి దేశవ్యాప్తంగా అభిమానంపొందారు.ఒక బంగారుపతకం.80 రజితపతకాలు,లతోపాటు ఎన్నో సత్కారాలతోపాటు,1983లో

వీరికళాసేవలకు ఆంధ్రప్రదేశ్ నాటకఆకాడమివారు కర్నులులో "నాటకకళాప్రపూర్ణ" బిరుదుతొ ఘనంగాసత్కరించారు.రవింద్రభారతిలో ఘనసత్కారంతోపాటు బంగారుకంకంణం బహుమతిగా పొందారు.ఈమెనటించిన చివరిచిత్రం"కుటుంబగౌరవం"(1984)ఈమెకుమారుడు చెన్నయ్ హైకోర్టులొ న్యాయవాదిగా,ఈమెమనుమడు కెనడాలో,మనమరాలున్యూయార్క్ లొ స్ధిరపడ్డారు.కళారంగానికి మరపురాని సేవలు అందించిన ఈకళామూర్తి 2012ఆగష్టు16నచెన్నయ్ పోరూరు రామచంద్రావైద్యశాలలో బ్రహ్మలోకంపయనించారు.