పుస్తకాలు -బాల గేయం : -- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు


 పుస్తకాలోయ్ పుస్తకాలు 

వెలిగించేనోయ్ మస్తకాలు!


కథలు,చరిత్ర,ఇతిహాసాలు 

పాటలు,పద్యం, ప్రహేళికలు 

చదివిన కొద్దీ కుతూహలం 

క్రొత్తవి చదివే ఉబలాటం!

        ... # పుస్తకాలోయ్ #


సెలవులలోనా చదవండి 

స్నేహితులకూ చెప్పండి 

తెలివిని పెంచే పుస్తకమూ 

జీవితంలో ఉపయోగమూ!

      #పుస్తకాలోయ్ #


అంశాలెన్నో అనంతమూ 

చదువుతుంటే ఆనందమూ 

ప్రయాణములో ఒకతోడు 

పుస్తకం మనకు సరిజోడు!!

  

      # పుస్తకాలోయ్ #