పంటినొప్పులు తగ్గడానికి...: పి . కమలాకర్ రావు

 చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు  పంటి నొప్పులు రావడం  సర్వసాధారణంగా  మారిపోయింది. చిన్నపిల్లల్లో  దంత సమస్యలకు చాక్లెట్లు తినడం అనేది మూలకారణం. ఇతర తీపి పదార్థాలు కూడా  ఒక కారణం. రకరకాల  తీయని పేస్టులు కూడా  మరొక కారణం. అందులోని రసాయనిక పదార్థాలు కూడా  పళ్ళ ను మరింత పాడు చేస్తున్నాయి. పళ్ళు తోముకున్నతర్వాత చిగుళ్లపై వేలితో  రుద్దుకోవడం కూడా  చాలా అవసరం. ఎన్ని పళ్ళు ఉంటే  అన్నిసార్లు పుక్కిలించాలి అనేది  ఒక నియమం ఉంది.  చిన్న పిల్లలకు ఇది అలవాటుగా చేయాలి. కొద్దిగా సైంధవ లవణం నాలుగు చుక్కల నిమ్మరసం  కలిపి పళ్లపై రుద్దితే  పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి.
 ఉత్తరేణి చెట్టు వేరు భాగాన్ని  శుభ్రంగా కడిగి బాగా నమిలి పళ్లపై  రుద్దుకుంటే  పళ్ళు చాలా గట్టిపడతాయి. ఒంటి నొప్పులు కూడా రావు.
 తుమ్మచెట్టు చెక్కను తెచ్చి  నీటిలో వేసి మరిగించి  గోరువెచ్చగా ఉన్నప్పుడు  పుక్కిలిస్తే  పళ్ళు చాలా గట్టిపడతాయి. నొప్పులు కూడా తగ్గిపోతాయి.
 మేడి చెట్టు పుల్ల తో కూడా పళ్లు తోముకుంటే పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి . నొప్పులు తగ్గిపోతాయి. గొంతు కూడా శ్రావ్యంగా మారుతుంది.
 ఎక్కువగా చల్లగా ఉన్న నీరు త్రాగితే  పంటి నొప్పి ఎక్కువ అవుతుంది. చిన్న అల్లం ముక్కను తీసుకొని  పంటిపై అదిమిపట్టి తే  పంటి నొప్పి తగ్గిపోతుంది.
 మిరియాల కషాయం చేసుకుని  పుక్కిలించిన  పంటి నొప్పులు తగ్గిపోతాయి
 నువ్వులను  కొద్దిగా వేయించి  చల్లారిన తర్వాత  బాగా నమిలి తింటే పంటి నొప్పులు రావు.
 లవంగాలను పొడిగా దంచి  నీటిలో కలిపి  పుక్కిలించి నాకూడా  పంటి నొప్పులు తగ్గిపోతాయి.
 పంటి నొప్పి చాలా తీవ్రంగా ఉన్నప్పుడు  కొద్దిగా దాల్చిన చెక్క పొడి లో  తేనె కలిపి  పంటిపై పెట్టుకోవాలి. పంటి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.
 ప్రతిరోజు  పళ్ళు తోముకున్నతర్వాత త్రిఫల చూర్ణం లో కొద్దిగా సైంధవ లవణం కలిపి  గోరువెచ్చని నీటిలో వేసి  బాగా పుక్కిలిస్తే  అసలు పంటి నొప్పులు రావు, వచ్చినా తగ్గిపోతాయి. దంతాలను సంరక్షించుకోవాలి అనుకుంటే , ఈ ఆధునికమైన  పేస్టులు మాని , ఆయుర్వేద వనమూలికలతో  తయారైన పేస్టులను , పళ్ళ పొడులను  వాడుకుంటే  మన పళ్ళను కాపాడుకోవచ్చు.