పుస్తకంలో అచ్చులు: -కవిత వేంకటేశ్వర్లు

 పుస్తకమే నీ నేస్తం కావాలి
ఎల్ల వేళల నీ వెంట వుండాలి
చదువు కన్న ఏదీ ముఖ్యం కాదు
జ్ఞానము కన్న మిన్న ఏదీ లేదు
అ ఆలలో అమృతముంది
ఇ ఈ లలో ఈశుడున్నాడు
ఉ యూలలో ఉపకారముంది
ఋ ఋలలో ఋక్షముంది
ఎ ఏలలో ఎరుక ఉంది
ఐలో ఐకమత్యముంది
ఒ ఓలలో ఓరిమి ఉంది
ఔ లో ఔనిత్యము0ది
అం లో అందముంది
ఆహలో హాటకముంది