నాయకుడు(నానీలు): -డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.


 1.నిస్వార్థం,నిర్భీతి

నిండైన వ్యక్తిత్వం.

నిజాయితీ,సత్యం

కావాలి నాయకునికి.


2.ప్రజలను 

కన్నబిడ్డల వలె

కాపాడే వాడే

నిజమైన నాయకుడు.


3.ఉద్యమాల్లో 

తాను ముందుండి

నడిపించేవాడే

అసలైన నాయకుడు.


4.సేవ,త్యాగాలు

తన సాధనాలు‌

వీరం,సహనం

తన‌ కర్తవ్యాలు.


5.నమ్మిన‌ వారి కోసం

నడుస్తాడు.

నమ్మిన ఆశయానికి

కట్టుబడతాడు.


6.ప్రజాహితం

సమ్మతమైన,

నిరంతర

కర్తవ్యనిర్వహణం.


7.శీలం,క్రమశిక్షణ

రెండు కళ్ళై,

ధర్మం,న్యాయం

అవధరిస్తాడు.