పవర్ ఉన్నోణ్ణి నేను: -మొహమ్మద్. అఫ్సర వలీషా: -ద్వారపూడి (తూ గో జి )

 పాల బుగ్గల పసివాణ్ణి నేను
పేచీలకు అలకలకు బహుదూరం నేను 
పట్టు దలకు మారు పేరును నేను
పనులన్నీ చకచకా చేసుకునేటోణ్ణి నేను
పేదా గొప్ప తేడా తెలియనోణ్ణి నేను
ఫిదా అవుతా అమ్మా నాన్నా అక్కయ్యలకు నేను
 పోకిరీ పోరగాళ్ళతో స్నేహాలకు దూరం నేను
పదుగురిలో మంచి పేరు ఉన్నోణ్ణి నేను 
పగలకు  ప్రతీకారాలకు దూరం నేను
పేరు ప్రఖ్యాతులు, చదువు సంధ్యలకు 
ఫస్ట్  కేరాఫ్డ్ర అడ్రస్  నేను
పోట్లాటలకు దూరం నేను
ప్రకృతి చూస్తే  పరవశిస్తా నేను
ప్రాణమిస్తాను ఫ్యామిలీకి నేను
పిల్ల వాడిని కాను ప్రేమ పిడుగును నేను
పిరికి తనాన్ని పార దోలే ధైర్యాన్ని నేను
పొద్దు సంద్యల వెలుగును నేను
పసివాణ్ణి అయినా పవర్ ఉన్నోణ్ణి  నేను