ఏమి చూసి ఇచ్చాయిఈ బాంకులు ,
వేలకువేల కోట్ల రుణాలు.!
సామాన్యుడి సొమ్ముకి ,
రక్షణ కరవైన
వేళాకోళపు విధానాలు !
బీరు బాబు
బయటకి వెళ్ళినప్పుడే,
కళ్ళు తెరవాలికదా ,
అధికారగణం ,
నిమ్మకు నీరెత్తినట్టు
నిద్రావస్థలో -
ప్రభుత్వం !
నేతల చేతి వాటం లేకుండా ,
బ్యాంకు బాబుల
చేయి కలవకుండా ...
సాధ్యమా ...
ఇంత పెద్ద స్కాము ?
ఒకడి ని మించి
మరొకడు ......
స్కాములందు ,
ఏ స్కాము పెద్దదయా ...
అన్నట్టు ....
గిన్నీస్ బుక్ రికార్డుల్లో
నమోదుకోసం అన్నట్టు !!
ప్రజా ఉద్యమం
నదిలా ప్రవహిస్తే తప్ప,
ఉత్తుంగ తరంగమై
ఎగిసి పడితే తప్ప ,
స్కామిస్టుల చేతికి ,
సంకెళ్లు పడితె తప్ప ,
ఈ బ్యాంకులను
నమ్మేట్టు లేదు !
ఈ ప్రభుత్వాలమీద
నమ్మకం కుదిరేట్టు లేదు !!
_.
నమ్మకం...!!:-___కె .ఎల్వీ