ఆరాధ్య ఆరాధ్య ! అందాల ఆరాధ్యఅలంకలరణలలో మెరుపుల ఆరాధ్య
అపరంజి బొమ్మ ఆరాధ్య
ఆనందాల రెమ్మ ఆరాధ్య
అరవిచ్చిన పువ్వు ఆరాధ్య
అలుపెరగని నవ్వు ఆరాధ్య
అమ్మ వెనకే తిరిగే ఆరాధ్య
అమ్మమ్మ ముద్దు బొమ్మ ఆరాధ్య
అలకల అల్లరి పిల్ల ఆరాధ్య
ఆగక పరుగు తీసే ఆరాధ్య
అల్లిబిల్లి తిరుగుతూ ఆరాధ్య
ఆటలెన్నో అడుకునేను ఆరాధ్య
అల్లారు ముద్దుల పిల్ల ఆరాధ్య
అపురూపమైనదమ్ము ఆరాధ్య
ఆరాధ్య: --డా. కందేపి రాణి ప్రసాద్