రేపు అనూరాధ ఎద సవ్వడి ఆవిష్కరణ


 అక్షర్యాన్ ఆధ్వర్యంలో శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి ,మోహిత గార్ల సారథ్యంలో "అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం" సందర్భంగా మహారాష్ట్ర పూర్వ గవర్నర్ గౌరవనీయులు సిహెచ్ విద్యాసాగర్ రావు గారి సమక్షంలో బేగంపేట, హైదరాబాదు,టూరిజం ప్లాజా హోటల్ లో 21.2.2021 న    ఉదయం 11 గంటలకు సభ జరపబడును.ఆ సభలో మన గాయత్రి నగర్ కు చెందిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి యలమర్తి అనూరాధ గారి" ఎద సవ్వడి "కవితల పుస్తకం ఆవిష్కరణ జరగబోతోంది.

     ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి(ఐ. ఏ.యస్) గారు, విశిష్ట అతిథిగా శ్రీ జె.డి లక్ష్మీనారాయణ(ఐ.పీ.ఎస్) గారు విచ్చేయనున్నారు.పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు.