పల్లె పడుచు (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి . సిద్దిపేట


 పల్లె పడుచును చూసారా

పచ్చగడ్డి కోసుకుని

మోపు నెత్తిన పెట్టుకుని

చేతిలో కర్ర పట్టుకుని


గొర్రె మేకలు తోలుకుని

ఊరు దారి పట్టింది

ఇల్లు చేర వచ్చింది

మేకలు దొడ్డ్లో తోలింది


గేదకు మేత వేసింది

కాళ్ళు చేతులు కడిగింది

కుండలో బువ్వ వొండింది

పుంటి తొక్కు నూరింది


పిల్ల పాపాల పిలిచింది

కంచాల్లో బువ్వ పెట్టింది

అందురు కలిసి తిన్నారు

ఆనందంగా ఉన్నారు !!