జయధ్వజుడు.: డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు


 హైహయ వంశరాజు కృతవీరుని కుమారుడు కార్తవీర్యార్జునుడు.ఇతను దత్తత్రేయభక్తుడు ఎన్నోవరాలుపొంది సహస్త్రబాహువులుకలిగి రావణునేజయించినవాడు..వింధ్యాపర్వతానికి దక్షణంగాఉన్న నర్మదా నదీతీరాన ఉన్నమహిష్మతి పురం ఇతని రాజధాని.ఇతనికి పలువురు కుమారులు కలరు,వారిలో మహాభక్తులు, మహాబలశాలులు, అస్త్రప్రయోగం,యుద్దతంత్రంతెలిసినవారు అయిదుగురు.వారు శూరుడు,శూరసేనుడు, కృష్ణుడు,ధృష్టుడు, జయధ్వజుడు,వీరు బుషులను దర్శించి 'శివకేశవులలో ఎవరిని పూజించాలి అని అడిగారు' 'రాజశేష్ట్రులారా దేవుని ఏరూపంలోనైనాపూజించవచ్చు.ఏరూపంలో కొలిచినా ఏపేరునపిలిచినా ఫలితంఓక్కటే'రాజులు సాదారణంగా విష్ణువు,శివుడు,ఇంద్రునిపూజిస్తారు.దేవతలకుదేవుడు శ్రీమన్నారాయణుడు.రాక్షసులకుపూజ్యనుయుడు శివుడు. గంధర్వులకు,యక్షులకు దేవుడు చంద్రుడు.అన్నారు బుషులు. వారిసందేహంతీరడంతో రాజ్యంచేరుకుని పరిపాలనసాగించసాగారు.

ఒకరోజు విదేహుడు అనే రాక్షసుడు శూలంధరించి వీరిపై యుధ్ధానికివచ్చాడు.సోదరులు అయిదుగురు ఆరాక్షసునిపై రౌద్రాస్త్రం,వారుణాస్త్రం,ప్రాజాపత్యాస్త్రం,వాయువ్యాస్త్రం,కౌబేరాస్త్రం,ఐంద్రాస్త్రం,ఆగ్నేయఅస్త్రాలు ప్రయోగించినా ఫలితంలేకపోవడంతో జయధ్వజుడు శ్రీమహావిష్ణువును నిశ్చలమనసుతో ప్రార్ధించగా సుదర్శనచక్రం విదేహుని శిరస్సు ఖండించింది ఆనందంతో ప్రజలు హర్షధ్వానాలుచేసారు. విశ్వామిత్రునిద్వారా విష్ణుయాగం ఫలంగురించితెలుసుకున్న జయధ్వజుడు అతనిసోదరులు వశిష్టుని అధ్వర్యంలో మొదట రుద్రయాగం అనంతరం విష్ణుయాగంచేసారు.జయధ్వజునికి తాలజంఘడు అనేపుత్రుడు అతనికి వీతిహాత్రుడు,అతనికి అనంతుడు అతనికి దుర్జయుడు అనేకుమారుడు జన్మించాడు.