అనూరాధ ఎద సవ్వడి ఆవిష్కరణ


 అక్షర్యాన్ ఆధ్వర్యంలో శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి ,మోహిత గార్ల సారథ్యంలో "అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం" సందర్భంగా 

టూరిజం ప్లాజా హోటల్ లో 21.2.2021 న బేగంపేట, హైదరాబాదులో   ఉదయం 11 గంటలకు సభ జరిగింది.

         ఆ సభలో మన గాయత్రి నగర్ కు చెందిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి యలమర్తి అనూరాధ గారి" ఎద సవ్వడి "కవితల పుస్తకం ఆవిష్కరణ జరిగింది.

     ఈ ఆవిష్కరణ మహారాష్ట్ర పూర్వ గవర్నర్ శ్రీ సి.హెచ్.విద్యాసాగర్ గారు, అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి(ఐ. ఏ.యస్) గారు, విశిష్ట అతిథిగా శ్రీ జె.డి లక్ష్మీనారాయణ(ఐ.పీ.ఎస్) గార్ల చేతుల మీదుగా  చోటు చేసుకుంది.     

   "ఎద సవ్వడి"లో కవితలు మనసు పలికినవి అని,సామాజిక స్పృహతో రాసినవని,అందరి హృదయాలనూ దోచుకుంటాయని వారంతా ప్రశంసించారు.

   మాతృ భాషా దినోత్సవం రోజున నా పుస్తకం విడుదలవటం నాకు మరింత సంతోషంగా ఉందని అనూరాధ తెలియజేసారు.

     పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు.