తూరుపుకొండను పుట్టిన స్వామికిరణతోరములు కట్టిన స్వామి
పడమటి కొండను పట్టిన స్వామి
నీడను తోడుగ పెట్టిన స్వామి
దండాలయ్యా!దండాలు!
సూర్యదేవరా!దండాలు!
వేడికి పట్టము కట్టిన స్వామి
వెలుగుల పుట్టము కట్టిన స్వామి
కర్మసాక్షిగా నిలచిన స్వామి మా
ఘర్మజలాన్ని చూసిన స్వామి!
దండాలయ్యా!దండాలు!
సూర్యదేవరా!దండాలు!
నీటి బిందువులు పీల్చే స్వామి
నింగికి మబ్బులు తొడిగే స్వామి
వానలు వసుధకు యిచ్చేస్వామి
చెరువులు దొరవులు నింపే స్వామి
దండాలయ్యా!దండాలు!
సూర్యదేవరా!దండాలు!
వెలుగు తిండిగా పెట్టిన స్వామి
చెట్టూ చేమను తట్టిన స్వామి
ఆరోగ్యమునే యిచ్చిన స్వామి
ఐశ్వర్యమునే తెచ్చిన స్వామి
దండాలయ్యా!దండాలు!
సూర్యదేవరా!దండాలు!
చీకటి గడ్డను చీల్చే స్వామి
ఆకలి కడుపును నింపే స్వామి
మునులూ ఘనులూ కొలచిన స్వామి
వేదనాదమై వెలిగినస్వామి!
దండాలయ్యా!దండాలు!
సూర్యదేవరా!దండాలు!
దిణమణి వందురు ఖమణివందురు
ద్యుమణి వందురు ధ్యుతిమతివందురు
భాస్కరుడందురు భానుడందురూ
దినకరుడందురు తరణి యందురు
దండాలయ్యా!దండాలు!
సూర్యదేవరా!దండాలు!
కమల బాంధవుడ దండాలు
లోక బాంధవుడ దండాలు!
లోక బాంధవా దండాలు( బాల గేయం)-కిలపర్తి దాలినాయుడు