ఎవరు చెప్పారమ్మ : సత్యవాణి

 ఎవరు చెప్పారమ్మ ఈ విత్తుకు
ఎదిగి మొక్కగమారివ పూయాలని
తావి పంచాలని
ఎవరు చెప్పారమ్మ సేలఏరుకు
బిరబిరా పరుగు తీయాలని
గలగలా పాట పాడాలనీ
ఎవరు చెప్పారమ్మ ఈ పైరుకీ
పసిడి  పంటల సిరుల నివ్వాలనీ
ప్రాణికి భుక్తి అవ్వాలనీ
ఎవరు చెప్పారమ్మ ఈ పిట్టకూ
కిలకిలా రావాలు చేయాలనీ
హాయిగా గగనాన ఎగరాలనీ
అన్ని నేర్పేవాడు అతడొక్కడే
అన్నిటుండేవాడు అతడొక్కడే
మిన్ను మన్నుగాచు మహదేవుడే
ఆ మహాదేవుడే