తెలుగు తల్లి -(బాల గేయం ):--ఎం. వి. ఉమాదేవి.


 తెలుగు మాటలు తేనె ఊటలు 

తెలుగు పాటలు పూల బాటలు 

తెలుగు సీమలు పసిడిపంటలు 

తెలుగురైతులు బువ్వ చేతులు 


తెలుగుబిడ్డలే చిరుతపిల్లలు 

చురుకుఎదిగే చెరుకు గడలు 

తెలుగుచదువు గొప్ప గురువు 

శిష్యరేఖలు గురువుమహిమలు


తెలుగింటిలో సహజ మాటలు 

సామెతలతో  కదిలే రథములు 

తెలుగుకన్నెలు ముద్దబంతులు 

యువతమేధలో నింగి చుక్కలు 


తెలుగు భాషకు నీరాజనములు 

తెలుగు తల్లికి మల్లెల మాలలు