ధైర్యే సాహసే లక్ష్మీ!:-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 ధైర్యే సాహసే లక్ష్మీ!
అన్న మాట ఊతమై
అడుగులు పడాలి.
సాహసమే ఊపిరిగా సాగితేనే
విజయాలు దక్కేది.
చేయాలనే ఉత్సాహం.
చేసే తపన ఉంటే,
కార్యం శీఘ్రంగా నెరవేరుతుంది.
భయపడితే జారిపోయి,
పక్కకు ఒరిగిపోయి,
తప్పుకోవాల్సి వస్తుంది.
గుండె నిండా జంకు లేకుండా
అడుగులు ముందుకు
అదరక-బెదరక వేస్తేనే
అందలం ఎక్కేది.
సాహసం సేయరా డింభకా!
అని ప్రోత్సహించుకొని
ముందుకురకాలి!
కానీ!ఆలోచన,వ్యూహం,ప్రణాళిక,
అమలులో మాత్రం బుద్ధికుశలత చూపాలి.
సాహసమే లక్ష్మిని ప్రసాదించి
అందరిలో నిన్ను ప్రత్యేకం చేస్తుంది.