ప్రార్థన:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 సరస్వతీదేవి సర్వవిద్యల తల్లి

పరమేష్ఠిరాణి నను పాలించవమ్మా !! సరస్వతీదేవి!!

శ్వేతమరాళము పైని శుధ్ధకళ్యాణీ

కోటి సూర్యప్రభలతో కొలువైనవమ్మా

నలుమొగమువేలుపును చేపట్టినావూ

పలుకువెలదిగ నిన్ను పూజింతునమ్మా !! సరస్వతీదేవి!!

లలితమృదుపాణి ఓ శారదాంబా

కేలుమోడ్చీ నిన్ను నుతియింతు నమ్మా

పల్లవారుణపాద ఓ వాణిమాతా

నీ పదమంటి నిన్ను నే కొలుతునమ్మా !! సరస్వతీదేవి!!

సరిలేరు నీకెవ్వరు ఈ క్షితిలోనా

నా మనవి చేకొనవె భారతీదేవీ

వీణా పుస్తక పాణీ ఓ గీర్వాణిదేవీ

సకలవిద్యలు నాకు దయజేయవమ్మా !! సరస్వతీదేవి!!