దోమలు -బాల గేయం :---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు


 చీకట్లో దోమలోయ్ 

రాకెట్లో మనుషులోయ్ 

విజ్ఞానo ఎంతున్నా 

దోమల్తో బాధలోయ్ !


సంధ్య వేళ కోసమే 

కాచుకొని ఉంటాయి 

పగలు కూడా మూలల్లో 

దాగి కుడుతూ ఉంటాయి!


లట్టు దోమ,సన్నదోమ 

తేడా ఏమి లేదోయ్ 

కుట్టడమే తన లక్ష్యం 

తిండికోసమే నండోయ్ !


నీళ్ళు నిల్వ ఉన్నచోట 

మహరాజుగా ఉంటాయి 

పాతటైరు,కొబ్బరి చిప్పలు 

కుండపెంకులూ చాలంటాయ్!


దోమల్ని పెంచకండి 

రోగాలను పిలవకండి 

పరిసరాల శుభ్రతతో 

దోమలసలు రావండి!


ఫాస్ట్ కార్డు,జెట్ చక్రాలు 

దోమలబ్యాటూ, దోమతెరా

ఎన్నోఉన్నా దోమలు పోవే 

మనరక్తాన్నీ మనకేపూసెరా!!