దంత సమస్యలను మనం ఎప్పటికప్పుడు నివారించు కోకపోతే దాని ప్రభావం మన శరీర ఆరోగ్యంపై పడుతుంది. నోటిలో పుండ్లు పుడతాయి. పొట్ట లో కూడా అనేక గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. పల్లెల్లో నివసించే వారి కన్నా పట్టణాల్లో ఉండే వారికి దంత సమస్యలు చాలా ఎక్కువ. దీనికి సంబంధించిన ఆధునిక వైద్యం మరీ ఖరీదైనది. చిన్నచిన్న చిట్కాలతో దంత సమస్యలు రాకుండా కాపాడుకోవాలి.వేప పుల్లతో కానీ. కానుగ పుల్లతో కానీ మామిడి పుల్లతో కానీ అప్పుడప్పుడు పళ్లు తోముకోవాలి. పంటి సందుల్లో సూక్ష్మజీవులు చేరకుండా ఇది కాపాడుతుంది.
కరక్కాయ పొడి తో పళ్ళపై రుద్దుకుంటే పళ్ళు గట్టిపడతాయి. రాత్రి వేళలో తీపి పదార్థాలను తిని పడుకుంటే పళ్ళు చెడిపోవడం ప్రారంభమవుతుంది. రాత్రి వేళలో లవంగం తినడం ద్వారా ఈ సమస్యను నివారించుకోవచ్చు.
ఆవ నూనెలో కొద్దిగా పసుపు వేసి పంటి చిగుళ్ల పై బాగా రుద్దుకోవాలి. పంటి చిగుళ్ళు గట్టిపడతాయి. నొప్పులున్న తగ్గిపోతాయి.
కొన్ని కంది చెట్టు ఆకులను తెచ్చి శుభ్రంగా కడిగి ముక్కలు చేసి నీళ్లలో వేసి మరిగించి కొద్దిగా మిరియాల పొడి ఉప్పు వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో పోసుకొని బాగా పుక్కిలించాలి. పంటి చిగుళ్ళు గట్టిపడతాయి.
కొన్ని అడవి యాలకులను తెచ్చి కడిగి నీళ్లలో వేసి మరిగించి చల్లార్చి త్రాగితే పంటి నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి.
పంటి సమస్యలు ఎక్కువ అయినప్పుడు నోటిలో కూడా పుండ్లు పుడతాయి. అలాంటప్పుడు గోరింటాకును లేదా మైదాకు ను నీళ్లలో వేసి మరిగించి చల్లార్చిన కషాయాన్ని నోటిలో పోసుకొని బాగా పుక్కిలిస్తే నోటిలో పుండ్లు తగ్గిపోతాయి. ఇలాగే బంతి ఆకులతో చేసిన కూడా పుండ్లు తగ్గిపోతాయి.
దంత సమస్యల నివారణ...: పి . కమలాకర్ రావు