చెట్లనిండా పూలుచక్కగా విరిశాయి
చిట్టి మనసులన్ని
చిందులే వేశాయి !
తోటలో అందాలు
తొంగి చూస్తున్నాయి
బాటలో విరులన్ని
తివాచీ పరిచాయి !
ఉండవే చెల్లమ్మ
ఉయ్యాల వేద్దాము
ఊదా రంగుపూల
ఊసులే విందాము!
ఒక్కొక్క ఋతువులో
ఒద్దికగా పూలన్ని
గుత్తులుగా వికసించి
గుసగుసలు చెపుతాయి!
కొద్ది రోజులు అయినా
కొమ్మల్లో నిలిచుండి
పులుగులకు తేనెనూ
పుష్ఠిగా ఇస్తాయి !
పూలబ్రతుకు లోను
పుణ్యమెంతో ఉంది
ఆహార,విహారములు
పంచి నవ్వును పూలు!
ఊదారంగు పూలు -(బాల గేయం )-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు