శమంతకమణి.డా.బెల్లంకొండనాగేశ్వరరావు-చెన్నయ్ .


 వృష్టి వంశస్తుడైన 'నిమ్నుడి 'కుమారుడు 'సత్రాజిత్తు'సూర్యుని గురించి తపసుచేసి మెప్పించి అతని గళసీమ లోని 'శమంతకమణి'ని పొందాడు.దాన్నిధరించి తను నివసించే ద్వారకానగరానికివచ్చాడు.ఆమణి ఉత్తములవద్దమాత్రమే ఉంటుంది.ఆమణి ప్రతిదినం కొంతబంగారాన్ని ప్రసాదిస్తుంది.అదిఉన్నదేశం సుభిక్షంగా ఉంటుంది.ఆవిషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఆమణిని ద్వారకానగర పాలకుడైన ఉగ్రసేన మహరాజు వద్ద ఉండంటం సమంజసం అనితలచి,ఆమణినితనకు ఇవ్వవలసినదిగా కోరాడు.తిరస్కరించిన సత్రజిత్తు ఆమణిని తనతమ్ముడు'ప్రసేనుడికిఇచ్చాడు.మణిధరించిన ప్రసేనుడు వేటకువెళ్ళి సింహన్ని వేటాడబోయి దానిచేతిలో మరణించాడు.అదేసమయంలో అటుగా వచ్చిన' జాంబవంతుడు' ఆసింహన్ని సంహరించి,ప్రసేనుడి మెడలోని హరాన్ని తీసుకుని తన కుమార్తె అయిన 'జాంబవతికి'ఆభరణంగా ఇచ్చాడు.ప్రసేనుడు అడవినుండి తిరిగిరాక పోవడంతో మణికొరకు అతన్ని శ్రీకృష్ణుడు సంహరించాడని నిందవేసారు శ్రీకృష్ణునిపై.ప్రసేనుడిని వెదుకుతూ అడవికి వెళ్ళిన శ్రీకృష్ణునికి ప్రసేనుడు,సింహం కళేబరాలుకనిపించాయి.చిత్తడినేలపై అడుగు జాడలు చూస్తు జాంబవంతుడు నివసించే గుహకు చేరిన శ్రీకృష్ణునితొ  జాంబవంతుడు తలపడ్డాడు. యిరవై ఒక్క రోజుల పోరాటం అనంతరం శ్రీకృష్ణుడు అవతారపురుషుడు అని తెలుసుకున్న జాంబవంతుడు మణితోపాటు తనకుమార్తె జాంబవతిని యిచ్చిసాగనంపాడు.అలాద్వారక చేరిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు మణిని  అందజేయగా,తనకుమార్తే అయిన 'సత్యభామ'ను  వివాహంజరిపించాడు.ఆమణిని జాగ్రత్తగా ఉంచమని 'అక్రూరుని'కి యిచ్చాడు శ్రీకృష్ణడు.భయపడిన అక్రూరుడు దూరంగా వెళ్ళిపోవడంతో ద్వారకలో వర్షలు లేక ప్రజలు పలు యిబ్బందులు పడసాగారు.అదిగమనించినశ్రుకృష్ణుడు అక్రూరుని ద్వారకకు రప్పించాడు.విష్ణుభక్తుడైన అక్రూరునికి 'దేవవన' 'ఉపదేవ'అనే యిరువురు కుమారులు ఉన్నారు.