నకిలీ పట్టాలు(నానీలు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.


 1.అంగట్లో సరుకులు

డిగ్రీలు.

డబ్బుంటే చాలు

దొరుకుతాయి.


2.అందలం ఎక్కేందుకు

అడ్డదారి.

నౌకరీ కొట్టేందుకు

చెడ్డదారి.


3.చదవకున్నా

పరీక్ష రాయకున్నా

పాస్ అవుతావు.

పట్టా పుచ్చుకుంటావు.


4.ధనసంపాదనే

లక్ష్యం వారికి.

విలువలకు లేదు

సాక్ష్యం మరి.


5.అనైతిక 

అవసరాలు.

నకిలీ పట్టాలతో

చెట్టపట్టాలు.


6.సాంకేతికతతో

చెడు సావాసాలు.

సామర్థ్యం లేక

దొంగపనులు.


7.అసలు ఏది?

నకిలీ ఏది?

తెలుసుకోలేనంతగా

నకి"లీల"లు.