సామెత కథ : ఎం . బిందు మాధవి

 అడిగే వాడికి చెప్పేవాడు లోకువ-  చెప్పే వాడికి వినే వాడు లోకువ!
 
‘పార్వతి’కి అరవైయేళ్ళు. 25 సంవత్సరాలు ఉద్యోగంచేసింది. ఆతరువాత, భర్త చేసే వ్యాపారంలో ఆఫీస్పనంతా నిర్వహించేది.
స్వతహాగా గట్టి ‘ఆరోగ్యవంతురాలు’కాకపోయినా, ‘క్రమశిక్షణ’ కలిగిన మనిషికనుక చెప్పుకోదగ్గ అనారోగ్యాలేమీ లేకుండాఇప్పటిదాకా నెట్టుకొచ్చింది.
పిల్లలకి ‘చదువులు’, ‘పెళ్ళిళ్ళు’విజయవంతంగా నిర్వహించి మనవల్నికూడా ఎత్తుకుని వారితో బాగాఆనందిస్తున్నది. ఇంతవరకు అంతాబాగానే ఉన్నది.
ఈ మధ్యనే కొంత ‘అనారోగ్యం’ వచ్చిఒకటికి- రెండు సార్లు డాక్టర్లనిసంప్రదించవలసి వచ్చింది. అక్కడమొదలయ్యింది, ప్రహసనం. 
గుండెకి సంబంధించిన డాక్టర్ ఏవోపరీక్షలు చేయించమని, ఆ ‘రిపోర్ట్’ ల నిబట్టి, ‘ప్రశ్నల చిట్టా’ విప్పారు.
--‘మీకు బీపీ ఉన్నదా’? ‘లేదండీ’ - పార్వతి జవాబు
--‘డయాబెటిస్ ఉన్నదా’? ‘లేదండీ’ - పార్వతి జవాబు
--‘మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఆహారపు అలవాట్ల గురించి వివరంచెప్పండి’ అని అడిగారు.
--‘మీరువైట్ రైస్ తినకండి’ – ‘నేనువైట్ రైస్, బ్రౌన్ రైస్ చెరి సగం కలిపి వండితింటానండీ, అదీ
ఒక కప్పున్నర (చిన్న కప్పు)’ - పార్వతిజవాబు
--‘వేపుడు కూరలు తినకండీ’ – ‘నాకువేపుళ్ళు తింటే పొట్ట బరువెక్కినట్లుఉంటుందండి, అదీ కాక వేపుళ్ళుచేస్తుంటేనే, ఆ నూనె వాసనకి నాకు దగ్గువచ్చేస్తుంది. అది అరగటానికి లివ్ 52 టాబ్లెట్స్ వేసుకుంటే కానీ నిలవలేను’ - పార్వతి జవాబు
--‘గోధుమ తినాలండీ’- ‘నాకు గోధుమఅలర్జీ అండీ’ పార్వతి జవాబు
--‘స్వీట్స్ అస్సలు తినకూడదండీ’ – ‘నాకు స్వీట్స్ అసలు సహించవండీ’పార్వతి జవాబు
(పార్వతి ‘భర్త’ కి పదిహేనేళ్ళుగా‘డయాబెటిస్’! కానీ స్వీట్స్ మీద‘వ్యామోహం’, బజార్ నించి స్వీట్స్ తెచ్చి, తను తిని భార్య ని తినమని బలవంతపెడుతూ ఉంటాడు. (ఇది కొసమెరుపుఇక్కడ). 
ఆ మాటే డాక్టర్ గారి ముందు అనలేక, అనకుండ ఉండలేక తికమక ప డ్డాడు. భార్య స్వీట్స్ తినకపోవటం  మంచో కాదోతెలియని స్థితిలో పడ్డాడు, పార్వతి భర్త.
--‘రోజు గంట వాకింగ్ చెయ్యాలండీ’ – ‘నేను రోజూ వాకింగ్ కి మా పక్కింటి పార్క్ కివెళ్ళి గంట నడుస్తానండీ’. పార్వతి జవాబు
--‘అన్నీ చేస్తూ ఉన్నా కూడా మీబరువు తగ్గట్లేదంటే, సర్జరీ కి రికమెండ్చెయ్యవలసి వస్తుంది’ – ‘డాక్టర్’ గారి చివరినిర్ణయం (సర్జరీ అంటే ‘బేరియాట్రిక్’ అన్నమాట)
--‘మీరేం చేస్తారో తెలియదు , 4-5 కిలోలు బరువు తగ్గాలండీ. ప్రకృతిచికిత్సాలయంలో చేరండీ’.
ఇక “యోగాఅడ్వైజర్” వంతు -
--‘ఉదయమే ఖాళీ కడుపుతో యాపిల్సైడర్ వెనిగర్ తాగాలండీ’- టీచర్ సలహా. ‘అది తాగితే నాకు విపరీతంగా అసిడిటీవచ్చి, ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. రోజంతాఏమీ చెయ్యలేక,
తినలేక మంచానికి కరుచుకునిపడుకుంటున్నానండీ’ - పార్వతి జవాబు. 
(ఈ విషయం విని ఇంకో శ్రేయోభిలాషిఅయిన డాక్టర్ గారు, ‘అయ్యో ‘యాపిల్సైడర్ వెనిగర్’ ‘డయాబెటిస్’ ఉన్న వాళ్ళకిమంచిది, మీ లాంటి శరీర తత్వం ఉన్నవాళ్ళకి కాదు’ అన్నారు)పార్వతి ‘