ప్రశాంత సమయం ...!!:-----డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,హన్మకొండ .


 చేట లో బియ్యం 

ఆనాటి అకలిని తీర్చే 

అన్నం వండేందుకు 

సన్నాహం ......!


బియ్యంలో --

రాళ్ళూ -రప్పలు 

వడ్లు -ఏరేసినట్టు ...

మదిలో ...ముసిరిన

ఆమె ఆలోచనలు ...

ఒక్కొక్కటి 

ఏరివేయబడుతున్నాయి !


నిన్నటిలోని 

అనర్దాలను ఏరిపారేసి 

రేపటిగురించి ...

పదునుదేరుతున్న 

ఆలోచనల పరంపర 

బ్రతుకు బాటకోసం 

నిరంతర శోధన !

చేట సహవాసం లోనే కదా 

ఆమెకు కూసింత 

ప్రశాంత సమయం చిక్కేది !!