గడ్డి పూలు -బాలగేయం :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు


 దారివెంట గడ్డిపూలు 

దాగి ఉన్నవి 

చిన్ని చిన్ని రేకులతో  

నవ్వుతున్నవి !


గొల్లభామ, తూనీగా 

ఆడు కున్నవి 

చల్లని  ఈ  గడ్డిలోను 

పండుకున్నవి !


ఆకుపచ్చ మిడతచూడు 

హాయి గంతులూ 

కుమ్మరి పురుగొకటి వచ్చి 

నేలకి కంతలూ !


ఏటిగట్టు నీటిపూలు 

ఎంత అందమోయ్ 

మాటలు రాకుండానే 

పాటలల్లునోయ్ !


గడ్డి పూలు అందరికీ 

నేస్తమాయెనోయ్ 

చెడ్డపనులు చేయకుంటే 

నువ్వూ అంతేనోయ్ !