ఎలుక బోధన(బాల గేయం)- ఎడ్ల లక్ష్మి

 చిన్న చిన్న ఎలుకమ్మా

చిన్నారి ఎలుకమ్మా

ఎందుకిటు వచ్చావు

ఏమి తీసుకొచ్చావు


చిట్టి పొట్టి పాపాయి

చిన్నారి పాపాయి

చదువుల ఒయ్యి తెచ్చాను

ఒయ్యి నీవు చదువమ్మా 


అందులో ఏమున్నాయో

చూసి చెప్పూ ఎలుకమ్మా

అందులో అన్నీ ఉన్నాయి

చక్కగ నీవు చదువమ్మా


తెలుగు హిందీ ఇంగ్లీషు

లెక్కలు సామాన్య సాంఘీక

అన్ని చూసి పాపాయి

శ్రద్ధగా నీవు చదువమ్మా


చిన్నారి చిట్టి పాపాయి

నే చెప్పే మాట వినవమ్మా

పెద్ద చదువులు చదువమ్మా

ఎంతో ఎత్తుకు ఎదుగమ్మా